- తెలంగాణ ప్రీ రబీ యాక్షన్ ప్లాన్‌ను వివరించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా యాసంగి పంటల సాగుకు సన్నద్ధత, రైతుల అవసరాలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీలో జాతీయ యాసంగి సదస్సు నిర్వహిస్తున్నారు. పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యత, సాగునీటి పరిస్థితులు, రైతులకు అవసరమైన సహాయ చర్యలపై సదస్సులో చర్చిస్తున్నారు. మంగళవారం రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో నిర్వహించే ఈ సదస్సులో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు.
తెలంగాణలో రబీ సాగుకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన ప్రీ--–-రబీ యాక్షన్ ప్లాన్‌ను ఆయన సదస్సులో వివరించనున్నారు. దేశవ్యాప్తంగా రబీ పంటల సాగుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, రైతుల అవసరాలు, సాగులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై మంత్రుల సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.
